కమల్ – అక్షర ట్వీట్స్…ఫ్యాన్స్ ఫిదా

240
Akshara has changed her religion...Kamal responds
- Advertisement -

వివేగం సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ అక్షర హాసన్‌. కమల్ గారాల పట్టిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న  అక్షర ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుంది.  ఇటీవల చెన్నైలో మీడియాతో మాట్లాడిన  అక్షర తనకూ కూడా దేవుడిపై నమ్మకం లేదని అందుకే బౌద్ధమతం స్వీకరించానని  చెప్పింది.

ఈ నేపథ్యంలో కమల్ ట్విట్టర్‌ ద్వారా  స్పందించారు. హాయ్ అక్షు. నీవు మతాన్ని మార్చుకున్నావా? నీవు మతాన్ని మార్చుకున్నా… నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మతం షరతులతో కూడి ఉంటుంది. ప్రేమకు షరతులు ఉండవు. జీవితాన్ని సంతోషంగా గడుపు. ప్రేమతో, మీ బాపు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కమల్ ను ఓ గొప్ప తండ్రిగా కొనియాడుతున్నారు.

మరోవైపు తండ్రి స్పందనతో అక్షర మురిసిపోతోంది.  హాయ్ నాన్న. మానవ జీవన మార్గం, గమ్యాన్ని బోధించే బౌద్ధ మతాన్ని నేను అంగీకరిస్తున్నా. అయినా ఇప్పటికీ నేను నాస్తికురాలినే’ అంటూ తండ్రి ట్వీట్ కు ఆమె రీట్వీట్ చేసింది.

- Advertisement -