నా జీవితంలో మర్చిపోలేని హిట్ “మజిలీ”; నాగచైతన్య

210
naga chaitanya

నాగ చైతన్య సమంత జంటగా నటించిన సినిమా ‘మజిలీ’.. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్. ఏప్రిల్ 5 న విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ కాగా నిర్మాతకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.. నాగ చైతన్య కెరీర్ లోనే వసూళ్ల పరంగా ఈ సినిమా ది బెస్ట్ అనిపించుకోగా ఈ సినిమా జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది.. అయితే తాజాగా ఈ సినిమా కి సంబంధించి సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించింది చిత్ర బృందం.. ఈ కార్యక్రమానికి నటులు రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తో పాటు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, అనిల్ రావిపూడి ముఖ్యఅథిధులు గా విచ్చేశారు..

ఈసందర్భంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణమయిన ప్రేక్షకులకు చాలా థాంక్స్.. అందరు కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేసారు… ఈ హిట్ అందరికి అంకితం.. శివ ఎప్పటికి మర్చిపోలేని హిట్ ఇచ్చాడు.. ఇంపార్టెంట్ టైం లో మంచి హిట్ ఇచ్చాడు.. ప్రొడ్యూసర్స్ సాహు, హరీష్ మంచి సపోర్ట్ చేశారు. ఈ హిట్ ని మర్చిపోలేను.. పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ లతో నటించాను.. మంచి అనుభూతిని ఇచ్చింది. సుబ్బరాజ్ తో ఒక సీన్ లో నటించాను.. ఆ సీన్ సినిమా లో లేదు కానీ మీరు చూస్తే బాగుంది అంటారు.. దివ్యాన్ష చాల బాగా నటించింది..తమన్ ఈ సినిమా కి మంచి లైఫ్ ఇచ్చాడు.. మరొకసారి అందరికి చాలా చాల థాంక్స్ అన్నారు..