మనం దర్శకుడితో నాగచైతన్య !

522
Vikram Kumar Chaitu
- Advertisement -

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ మూవీలో చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎప్రిల్ లో ఈమూవీ విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు చిత్రయూనిట్. ఈమూవీ తర్వాత చైతూ నాగార్జున బంగార్రాజు లో నటించనున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మరో సనిమా చేయనున్నాడు. ఈమూవీకి నాగేశ్వర్ రావు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

తాజాగా ఉన్న సమాచారం మేరకు నాగచైతన్య మరో మూవీని లైన్ లో పెట్టేశాడని తెలుస్తుంది. గ్యాంగ్ లీడర్ తో హిట్ కొట్టిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ సినిమా చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. బీవీఎస్ రవి ఈసినిమాకి కథను అందించినట్లుగా తెలుస్తుంది. విక్రమ్ కుమార్ గతంలో మనం సినిమాను తెరకెక్కించాడు. ఆ తర్వాత అఖిల్ తో హలో చిత్రాన్ని చేశాడు. ఈమూవీకి సంబంధించిన పూర్తి విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -