టాలీవుడ్ మన్మథుడు గేటప్ మార్చేశాడు. ఎన్నడూ లేని విధంగా మీసాలు తీసేసి సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో రకరకాల పుకార్లు షికార్ చేస్తున్నాయి. మారిన గెటప్‌తో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మనం సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసిన ఫొటో గుర్తుంది కదా! నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలు వారి వారి గెటప్‌లలో ఉన్న ఆ ఫొటోను చాలా మంది ఇష్టపడ్డారు. కానీ అందులో అఖిల్ కూడా ఉంటే బాగుండునని అభిమానులు అనుకున్నారు. ఇప్పుడు వారి కోరిక తీరింది. ఎలాగంటారా?…. తాజాగా నాగ్ దిగిన సెల్ఫీ నెట్టింట్లో వైరల్‌గా మారింది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి దిగిన సెల్ఫీని అఖిల్ షేర్ చేశాడు.
అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫొటో దగ్గర దిగిన ఈ సెల్ఫీని నెటిజన్లు తెగపొగిడేస్తున్నారు. కాకపోతే ఈ రియల్ లైఫ్ సెల్ఫీలో నాగేశ్వరరావు ఫొటో మాత్రమే ఉండటం కొంత వెలితిగా అనిపిస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఒక్కసారిగా మీసాలు లేకుండా నాగార్జున, పూర్తి గడ్డం, మీసాలతో నాగచైతన్య, అఖిల్ ఈ ఫొటోలో ఉండటంతో కుమారుల కంటే తండ్రి యంగ్‌గా కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం నాగ్ నటించిన రాజుగారి గది విడుదలకు సిద్దంగా ఉండగా తర్వాత రూ.1000 కోట్ట బడ్జెట్లో తెరకెక్కనున్న మహాభారతం సినిమాల నటించనున్నాడనే వార్తలు వెలువడతున్నాయి.ఈ సినిమాలో నాగ్ కర్ణుడి పాత్ర పోషించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నాగ్ గెటప్ మార్చడంపై ఉహాగానాలు జోరందుకున్నాయి.
Happy birthday thatha.We love you, we miss you and we know your with us forever in spirit Love you #ANRLivesOn @iamnagarjuna @chay_akkineni pic.twitter.com/Q5BjzFBPqX
— Akhil Akkineni (@AkhilAkkineni8) September 20, 2017