అర్జున్‌రెడ్డికి బంపరాఫర్‌ !

201
Vijay and Maniratnam planning to join hands
Vijay and Maniratnam planning to join hands
- Advertisement -

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో విడుదలైన అత్యంత వివాదాస్పదమైన సినిమా అర్జున్ రెడ్డి. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకు రాలేదు. దీనిపై భారీ అంచనాలు ఏర్పడటానికి కారణం టీజర్, ట్రైలర్. ఈ సినిమాలో స్టార్లు లేక పోయినా మంచి కంటెంటు ఉండడంతో ప్రేక్షకులు క్యూలు కట్టారు. అర్జున్‌ రెడ్డిగా విజయ్ దేవరకొండ నటనకు, తొలి సినిమాతోనే విమర్శకులను సైతం మెప్పించిన సందీప్‌ రెడ్డి వంగాకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో పలు అగ్ర దర్శకుల దృష్టిలో కూడా పడడంతో.. విజయ్ దేవరకొండకు పెద్ద ఆఫర్లు వస్తున్నాయని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తాజాగా మణిరత్నం నుండి విజయ్‌కి పిలుపు వచ్చిందన్న వార్త హల్ చల్ చేస్తోంది.

mani-ratnam

‘అర్జున్‌రెడ్డి’లో విజయ్‌ నటనను చూసిన మణిరత్నం తాను తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రంలో అవకాశం ఇచ్చారనే వార్త సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్‌ చేసింది. అయితే అది నిజం కాదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తాజా చిత్రంలో శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద స్వామి, ఫాజిల్‌, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌ తదితరులు మాత్రమే నటిస్తున్నారు’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

‘‘అర్జున్‌రెడ్డి’లో విజయ్‌ నటన మణిరత్నానికి బాగా నచ్చిందని, ఈ నేపథ్యంలో విజయ్‌తో కలిసి పనిచేసే ఆలోచనలో ఆయన ఉన్నారట. అయితే అది మల్టీస్టారర్‌ చిత్రం మాత్రం కాదట. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మణిరత్నం-విజయ్‌ల చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. ఇదే కనుక నిజమైతే అర్జున్‌రెడ్డి బంపరాఫర్‌ కోట్టేసినట్టే. ప్రస్తుతం మణిరత్నం మద్రాస్‌ టాకీస్‌ పతాకంపై తాజా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

- Advertisement -