బోల్డ్ వైపు టాలెంటెడ్ నటి

18
- Advertisement -

‘ఐశ్వర్య రాజేశ్’ వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్. మంచి నటి అయినా హీరోయిన్ గా మాత్రం ఆమె సక్సెస్ కాలేకపోయింది. ఐతే, ఇప్పటివరకు నటించిన సినిమాల్లో చాలా పద్దతిగా, ట్రెడిషనల్ రోల్స్ లో కనిపించిన ఐశ్వర్య రాజేశ్.. అటు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సెస్ కూడా అందుకోలేకపోయింది. అయినప్పటికీ, తెలుగులో, తమిళంలో మంచి సక్సెస్ సాధించింది. కానీ అవకాశాలే ఆశించిన రీతిలో దక్కలేదు. మరి స్టార్ ఛాన్సెస్ కావాలన్నా, ఇకపై అవకాశాలు క్యూ కట్టాలన్నా తన రూటు మార్చక తప్పదు అనుకుందో.. లేదంటే కొత్తవతారంలో ఎలాంటి సినిమాలు చెయ్యాలనుకుందో కానీ.. ఐశ్వర్య రాజేశ్ ఒక్కసారిగా బోల్డ్ బ్యూటీగా టర్న్ అయ్యింది.

ఐశ్వర్య రాజేశ్ తాజాగా ఓ వెబ్ సిరీస్ ఒప్పుకుంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించే ఈ సిరీస్ లో ఐశ్వర్య రాజేశ్ పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందట. శృంగారానికి బానిస అయిన ఓ సగటు ఇల్లాలు పాత్రలో ఆమె కనిపించబోతుంది. అసలు ఐశ్వర్య రాజేశ్ ఎందుకు ఈ పాత్ర ఒప్పుకుంది ? అంటూ ఆమె సన్నిహితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. చివరకు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ పద్దతికి కేరాఫ్ గా ఉండే ఫొటోస్ ని షేర్ చేసే ఐశ్వర్య రాజేశ్ ఇలా ఒక్కసారిగా బోల్డ్ బాట పడితే ఎలా ? అనేది ఆమె సన్నిహితుల ఆవేదన.

తనకు టాలెంట్ ఉన్నా.. ఆ స్థాయిలో అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదనే కసితో ఐశ్వర్య రాజేశ్ ఇలా బోల్డ్ బాట పట్టిందని టాక్. అందుకే, ఇక నుంచి గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేసి అందరూ అవాక్కయ్యేలా చేస్తాను అంటుంది ఐశ్వర్య రాజేశ్. గ్లామర్ గేట్స్ ఎత్తేసిన ఐశ్వర్య రాజేశ్ ను చూడడానికి నెటిజన్లు కూడా బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా కూడా స్లీవ్ లెస్ మోడ్రన్ డ్రెస్ లో తన నాటు అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తూ కవ్వించింది ఐశ్వర్య రాజేశ్. మరి ఈ సినిమాలో ఏ రేంజ్ లో అలరిస్తోందో చూడాలి.

Also read:సలాడ్ తో ఎన్ని ఉపయోగాలో తెలుసా!

- Advertisement -