పసివాడిని కాపాడిన ఎయిర్ హోస్టెస్….

248
Air hostess Mitanshi Vaidya saves baby who fell from mother's
- Advertisement -

ముంబై ఎయిర్ పోర్టులో సాహసోపేత ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ హోస్టెస్ మితాన్షి వైద్య ఓ పసిపిల్లాడిని కాపాడిన తీరు ప్రశంసల జల్లు కురిపిస్తుంది. ముంబై ఎయిర్ పోర్టులో సాధారణ తనిఖీలు పూర్తి చేసుకుని సెక్యూరిటీ కౌంటర్ వద్దకు ఓ మహిళ తన పసిబిడ్డను ఎత్తుకుని వస్తోంది. వస్తున్న ఆమె చేతులో నుంచి జారిపోతున్న ఆ పసిబాబుని అక్కడే జూడో క్లాసులకు వచ్చిన ఎయిర్ హోస్టెస్ మిథాన్సి వైద్య గమనించి ముందుకు దూకి కాపాడింది.

Air hostess Mitanshi Vaidya saves baby who fell from mother's

తాజాగా  పసివాడి తల్లి గులాఫా ఎయిర్ హోస్టెస్ కి కృతజ్ఞతలు చెబుతూ జెట్ ఎయిర్ వేస్ కు లేఖ రాసింది. మితాన్సి వైద్య అనే ఎయిర్ హోస్టెల్ తన జీవితాన్ని పణంగా పెట్టి నా బాబు పట్టుకునేందుకు దూకి కాపాడిందని, ఆ క్రమంలో ఆమె ముఖం, ముక్కుకు గాయాలయ్యాయని ఆమె లేఖలో పేర్కొంది.

పెళ్లై 14 సంవత్సరాల తర్వాత పుట్టిన నా బాబుని రక్షించిన ఆమెకు ఏదో ఒకటి ఇవ్వాలని ప్రయత్నించానని, కానీ ఆమె దానికి నిరాకరించిందని ఆ బాబు తల్లి గులాఫా తెలిపింది. కనీసం ఫోన్ నంబర్ ఇవ్వాలని అడిగానని ఆమె ఇవ్వలేదని, అలా ఇవ్వడం నిబంధనలకు విరుద్దమన్నారు, కేవలం ప్రార్థన చేసేటప్పుడు నా పేరు మాత్రం తలుచుకోండి చాలు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపింది. ఆమె దేవత లాంటిదని లేఖలో పేర్కొంది. ఈ లేఖను చేసిన జెట్ ఎయిర్ వేస్ అధికారులు మితాన్షి వైద్యను మెచ్చుకున్నారు.

- Advertisement -