ప్ర‌ధానికి స‌వాల్ విసిరిన రాహుల్ గాంధీ.. 

239
rahul modi
- Advertisement -

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌వాల్ విసిరారు. ఛ‌త్తీస్ గ‌డ్ లో రెండోద‌శ పోలింగ్ స‌మీపిస్తుండ‌టంతో ఇరు పార్టీల నేత‌లు జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా మోదీపై విమ‌ర్శ‌లు చేశారు రాహుల్ గాంధీ. దేశ ప్ర‌ధాని మెదీకి తాను స‌వాల్ విసురుతున్నాన‌ని..ర‌ఫెల్ ఒప్పందంపై జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల గురించి చ‌ర్చించ‌డానికి నేను రెడీ..మీరు ఎక్క‌డ‌కు ర‌మ్మ‌న్నా వ‌స్తాను. ఈఅంశంపై 15నిముషాలు నాతో చర్చించే ధైర్యం ప్ర‌ధానికి ఉందా అని ప్ర‌శ్నించారు.

rahul gandhi

ప్రభుత్వరంగ బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీల ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆ మొత్తంతో రైతుల రుణాలను మాఫీ చేస్తామని రాహుల్ ప్రకటించారు.అర్థరాత్రి సీబీఐ చీఫ్ ను తొలగించి ఆ సంస్థ ప్రతిష్ఠను మరింత మంటగలిపారని విమర్శించారు.రిజర్వు బ్యాంకు, ప్రభుత్వ సంస్థలు, సుప్రీంకోర్టు ఇలా అన్ని ప్ర‌భుత్వ సంస్ధ‌ల‌ను మోడీ భ్ర‌స్టు ప‌ట్టిస్తున్నార‌న్నారు. ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయాల కారణంగా కోట్లాది మంది భారతీయులు బాధపడుతున్నారని చెప్పారు. ఈసారి ఛ‌త్తిస్ గ‌ఢ్ లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు.

- Advertisement -