‘అజ్ఞాతవాసి’ హంగామా మొదలైంది..

258
- Advertisement -

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలగా నటించారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించాడు. ఈ నెల మధ్యలో ‘అజ్ఞాతవాసి’ సందడి బాగా కనిపించింది. ఈ నెల 16న విడుదలైన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఇంకో మూడు రోజుల వ్యవధిలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించడంతో అప్పుడూ ఈ సినిమా వార్తల్లో నిలిచింది.

అయితే తర్వాత ఉన్నట్లుండి ‘అజ్ఞాతవాసి’ అడ్రస్ లేకుండా పోయింది. గత వారం నుంచి ఈ సినిమా గురించి డిస్కషన్లే లేవు. ఏ రకమైన ప్రమోషన్లూ లేవు. 26న అనుకున్న ప్రకారం ట్రైలర్ లాంచ్ చేసి ఉంటే కథ మరోలా ఉండేదేమో. అయితే కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ హంగామా మొదలైంది. తాజాగా ఈ మూవీ నుండి ‘స్వాగతం కృష్ణా’ పాటను రిలీజ్‌ చేశారు. ఈపాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.

Agnyathavaasi Movie Promotions

అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని రిలీజ్ చేయడంతో పాటు రిలీజ్ డేట్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు. అందులో పవన్ లుక్ అదిరిపోయింది. వారణాసి బ్యాక్ డ్రాప్ లో ఉన్న లుక్ ఇది. దీన్ని చూసి పవన్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ పాడిన ‘కొడకా కోటేవ్వరరావు’ పాటను ఆదివారం రాత్రి రిలీజ్ చేయబోతున్నారు. అది వచ్చాక సందడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కొంచెం గ్యాప్లోనే విశాఖ వేదికగా ప్రి రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఇందులోనే ట్రైలర్ కూడా లాంచ్ చేస్తారు. కాబట్టి జనవరి 10న సినిమా విడుదలయ్యే వరకు ‘అజ్ఞాతవాసి’ సందడి కొనసాగడం ఖాయం. జనవరి 9న యుఎస్లో భారీ ఎత్తున ప్రిమియర్ షోలతో ‘అజ్ఞాతవాసి’ హంగామా మొదలవుతుంది.

- Advertisement -