15రోజుల్లో గట్టుప్ప‌ల్ ను మండ‌లం చేస్తాః కేసీఆర్

219
kcr speech
- Advertisement -

త‌మ ప్ర‌భుత్వం తిరిగి అధికారంలోకి వ‌చ్చిన 15రోజుల్లోనే గ‌ట్టుప్ప‌ల్ ను మండ‌ల కేంద్రంగా ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు సీఎం కేసీఆర్. న‌ల్గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం చండూరులో జ‌రిగిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గోన్నారు. ఈసంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌స్తార‌ని తాను అనుకోలేద‌న్నారు. ఈస‌భ‌లో ఉన్న జ‌నాల‌ను చూస్తుంటే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ గెలుపుఖాయ‌మ‌నిపిస్తుంద‌న్నారు.

kcr

మీది ఫ్లోరైడ్ ప్రాంతం. కరువు ప్రాంతం. మంచినీళ్లయితే తెచ్చినం. మిషన్ భగీరథ పూర్తవుతుంది. ఇంకో 20 రోజుల్లో ఇంటింటికీ నల్లా ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తవుతుంది. మునుగోడు ప్రాంతానికి లక్షా 75 వేల ఎకరాలకు నీళ్లిచ్చే విధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో పూర్త చేసి..మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

kcr

భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్‌లో లిక్కర్ మాఫియా ఒత్తిళ్లకు లొంగి గౌడ కులస్థులకు అన్యాయం చేసిన్రు. గీతకార్మికులకు చెట్ల పన్ను చెల్లించే అవసరం లేకుండా రద్దు చేశాంమ‌ని చెప్పారు. ఈసంద‌ర్భంగా మునుగోడు టీఆర్ఎస్ అభ్య‌ర్ది కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.

- Advertisement -