‘ఆదిపురుష్’ ఒక్కో టికెట్ 3 వేలు

74
- Advertisement -

ఆదిపురుష్ సినిమాపై రోజు రోజుకూ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, రెండు ట్రైలర్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఫైనల్ ట్రైలర్‌లో యాక్షన్, విజువల్ అంశాలు మరింతగా ఎట్రాక్ట్ చేయడంతో అవి మూవీపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసాయి. జూన్ 16న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ మూవీ తప్పకుండా అంచనాలకు మించి ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పైగా ఆదిపురుష్ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కాబోతుంది.

ఐతే, జూన్ 16న సినిమా రిలీజ్ అవుతున్నా.. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం నుంచి ఓపెన్ కానున్నాయని చిత్రయూనిట్ వెల్లడించింది. టికెట్ల కోసం ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. బ్లాక్ లో టికెట్లు భారీగా అమ్మడు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మెట్రో పాలిటిన్ సిటీస్ లో ప్రీమియర్ షోకి సంబంధించిన ఒక్కో టికెట్ 3 వేలు పలుకుతుందట. మొత్తమ్మీద ఆదిపురుష్ సినిమాకి ఒక్క ప్రీమియర్స్ తోనే భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పైగా ఈ సినిమాకి ప్రభుత్వాల నుంచి సపోర్ట్ ఉంది. ఇటు తెలంగాణ లోనూ అటు ఏపీలోనూ ఈ సినిమాకి కొన్ని ప్రత్యేక అనుమతులు కూడా అందుతున్నాయి.

Also Read: RRR పై ఆగని ప్రశంసల వర్షం

రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తోన్న ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పైగా ఈ మూవీని మోషన్ కాప్చర్ విధానంలో షూట్ చేశారు. ఈ మోషన్ కాప్చర్ విధానం ద్వారా సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ హై-బడ్జెట్ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో తీసినట్లు తెలస్తోంది. ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు.

Also Read: అర్ధనగ్న తార లోనూ అమ్మతనం

- Advertisement -