సెమీ న్యూడ్ గా జాన్వీ కపూర్

36
- Advertisement -

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాలతో చేయబోతున్న భారీ పాన్ ఇండియ‌న్ మూవీగా దేవ‌ర. ఈ సినిమా భారీ షెడ్యూల్ రీసెంట్‌గా మొద‌లైంది. 20 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్‌పై భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ రోజు, రేపు ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్ కూడా జాయిన్ కానుంది. జాన్వీ పై సైఫ్ అలీ ఖాన్‌ అటాక్ చేస్తే.. ఎన్టీఆర్ ఆమెను సేవ్ చేసే సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అయితే, ఈ సీన్స్ లో జాన్వీ కపూర్ సెమీ న్యూడ్ గా కనిపించబోతుందని.. ఓ మంచి రొమాంటిక్ సాంగ్ కు ఈ సీన్స్ లీడ్ అని తెలుస్తోంది.

ఇక గతంలో కొరటాల – ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తవగా.. ప్రస్తుతం జరుగుతున్న మూడో షెడ్యూల్ కోసం ఎన్టీఆర్‌ తన లుక్ ను కూడా పూర్తిగా మార్చాడు. అన్నట్టు కొరటాల శివ కథకే కాదు, కథ జరిగే నేపథ్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో జరగనుంది. సినిమాలో విజువల్స్ అదిరిపోతాయట. ముఖ్యంగా సముద్రంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయట.

Also Read: ‘ఆదిపురుష్’ ఒక్కో టికెట్ 3 వేలు

కేవలం ఈ సీక్వెన్స్ లను దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను ఈ సినిమాకు తీసుకున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ అంతర్జాతీయ మూవీని కొరటాల శివ కసితో తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. నిజానికి కొరటాల శివ ప్లాప్ లో ఉన్నా.. ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అతనితోనే సినిమా చేస్తున్నాడు.

Also Read: RRR పై ఆగని ప్రశంసల వర్షం

- Advertisement -