- Advertisement -
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రతి ఏడాదీ ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో సేవాకాలం నిర్వహించారు.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా జనవరి 20న చిన్నశాత్తుమొర, జనవరి 26న ప్రణయ కలహోత్సవం, జనవరి 30న పెద్దశాత్తుమొర నిర్వహిస్తారు.
Also Read:హను-మాన్‌లో డిఫరెంట్ రోల్ చేశా:వరలక్ష్మీ
- Advertisement -