‘ నీవెవ‌రో’ సినిమాలో హీరోయిన్ గా తాప్సి.

342
neevevaro first look
- Advertisement -

గ‌తేడాది విడుద‌లైన ఆనందోబ్ర‌హ్మ సిసిమాతో మంచి విజ‌యాన్ని అందుకుంది తాప్సి. హీరోయిన్ గా ఎక్కువ‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌టంతో ప‌లు లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది తాప్సి. తాజాగా తెలుగులో ఒక సినిమాకు ఓకే చెప్పింది తాప్సి. ఆది హీరోగా తెర‌కెక్కుతున్న నీవెవ‌రో సినిమాలో తాప్సి ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక మ‌రో హీరోయిన్గా రితికాసింగ్ ను ఎంపిక చేశారు. ఈసంద‌ర్భంగా ఆసినిమా టైటిల్ లోగోను విడుద‌ల చేశారు న్యాచుర‌ల్ స్టార్ నాని.

neevevaro first look

నీవెవ‌రో సినిమా టైటిల్ లోగోను ఆవిష్క‌రిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంద‌న్నారు నాని. ఈసినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాన‌న్నారు. ఈసంద‌ర్భంగా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు హీరో నాని. నువ్వు చెప్పిన క‌థ‌కు టైటిల్ అదిరిపోయింది బాబాయ్ అంటూ హీరో ఆదికి నాని ట్వీట్ట‌ర్ లో విడుద‌ల చేశారు. ఎంవీవీ సినిమా ప‌తాకంపై ర‌చ‌యిత కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమ‌కు హ‌రినాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వెన్నెల కిషోర్ ఈసినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. గుండెల్లో గోదారి త‌ర్వాత తాప్సి ఆది క‌లిసి న‌టిస్తున్నారు. తాప్సి ప్ర‌స్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో న‌టిస్తోంది.

Aadhi Pinisetty

- Advertisement -