హిండెన్ బర్గ్ -అదానీ వ్యవహరంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం విషయంలో గురువారం సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే గతంలో కేంద్రం నియమించిన కమిటీని తిరస్కరించి… సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆధ్వర్యంలో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రస్తుత కమిటీకి సప్రే నాయకత్వం వహిస్తుండగా…విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఓపీ భట్, జేపీ దేవదత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, బ్యాంకింగ్ దిగ్గజం కేవీ కామత్, సోమశేఖరన్ సుందరేశన్‌ను కమిటీ సభ్యులుగా పేర్కొంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రస్తుతం కొనసాగిస్తున్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ చంద్రచూడ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దూమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించినప్పటికి…అదానీ సంస్థకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే.
ఇదే విషయంపై గౌతమ్ అదానీ స్పందిస్తూ..సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అదానీ గ్రూప్ స్వాగతిస్తోంది. నిర్దిష్ట వ్యవధిలో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నాం నిజం గెలుస్తుంది. అని అదానీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
The Adani Group welcomes the order of the Hon'ble Supreme Court. It will bring finality in a time bound manner. Truth will prevail.
— Gautam Adani (@gautam_adani) March 2, 2023
ఇవి కూడా చదవండి…