ప్రతి ఒక్కరికీ ఓ కట్టప్ప అవసరం ఉంది: తమన్నా

224
sathyaraj
- Advertisement -

కట్టప్ప పాత్ర ద్వారా ప్రాచుర్యం పొందిన సత్యరాజ్‌, ఆరోగ్య సంరక్షణ బ్రాండ్‌ ప్రిస్టిన్‌ కేర్‌ యొక్క తాజా ప్రచారంలో భాగమయ్యారు. తమ జీవితాలలో ప్రతి ఒక్కరికీ ఓ కట్టప్ప అవసరం ఉంది’ ప్రకటన ప్రిస్టిన్‌ కేర్‌ వద్ద చికిత్స పొందే రోగులు అందుకునే పర్సనల్‌ కేర్‌ బడ్డీ సేవలను పరిచయం చేయనుంది.

అవంతికగా కనిపించిన తమన్నా భాటియా నేడు, తన సహనటుడు సత్యరాజ్‌ యొక్క వీడియోను పంచుకోవడంతో పాటుగా పర్సనల్‌ కేర్‌ బడ్డీ గురించి మాట్లాడారు. హెల్త్‌కేర్‌ బ్రాండ్‌ పిస్టిన్‌ కేర్‌ అందిస్తున్న ఉచిత రోగి సంరక్షణ సేవ ఇది. ఈ వీడియోలో సత్యరాజ్‌ మాట్లాడుతూ మాహిష్మతి రాజ్య పరిరక్షణలో శౌర్యం, సంరక్షణ లక్షణాల పరంగా కట్టప్ప పాత్ర ప్రసిద్ధి చెందింది. ఈ పాత్రకు సరిసమానమైన రీతిలో ప్రిస్టన్‌ కేర్‌ యొక్క పర్సనల్‌ కేర్‌ బడ్డీ ఉండనుంది అని అన్నారు.

ఈ బడ్డీ లేదంటే స్నేహితుడు, శస్త్రచికిత్సకు సంబంధించి ప్రతి అంశంలోనూ సహాయపడతాడు. అంటే డాక్టర్‌ కన్సల్టేషన్‌ మొదలు భీమా అనమతులు వరకూ, ఆస్పత్రిలో అడ్మిషన్‌ మొదలు మరెన్నో అంశాల పరంగా రోగుల శస్త్ర చికిత్స ప్రయాణంలో తోడ్పడతాడు. ఈ ప్రకటన చివరలో ఆయన ‘శస్త్ర చికిత్స అంటే ప్రిస్టిన్‌ కేర్‌’ అని వెల్లడిస్తారు. తమిళ, తెలుగు, కన్నడ భాషలలోని ఈ ప్రకటన చిత్రాలతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌, షేర్‌చాట్‌ మరియు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించనున్నారు.

తన అనుభవాలను సత్యరాజ్‌ వెల్లడిస్తూ ‘‘ప్రిస్టన్‌ కేర్‌ బృందంతో పాల్గొన్న ఈ ప్రకటన షూటింగ్‌ పూర్తి వినోదాన్ని నాకందించింది. కట్టప్ప క్యారెక్టర్‌ను ప్రేక్షకులు స్వీకరించిన తీరు, వారు చూపిన ప్రేమను మరోమారు నాకు గుర్తుకు తెచ్చింది. కట్టప్ప లాంటి వ్యక్తే పర్సనల్‌ కేర్‌ బడ్డీ. ప్రతి రోగికీ తమ శస్త్ర చికిత్స సమయంలో తోడ్పడేందుకు ప్రిస్టన్‌ కేర్‌ నియమించింది. ప్రపంచంతో ఈ అంశాన్ని వెల్లడించేందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ కారణం చేతనే వారు సర్జరీ అంటే ప్రిస్టిన్‌ కేర్‌ అని అంటున్నార’’ని వెల్లడించారు.

సుప్రసిద్ధ హెల్త్‌కేర్‌ బ్రాండ్‌ ప్రిస్టిన్‌ కేర్‌. ఇది కనీస కోత కలిగిన శస్త్రచికిత్సలను 50కు పైగా వ్యాధులు అయినటువంటి పైల్స్‌, హెర్నియా, క్యాటరాక్ట్‌ మరియు మరెన్నో సమస్యలకు చేస్తుంది. హైదరాబాద్‌, వైజాగ్‌, చెన్నై, బెంగళూరు, కొచి, విశాఖపట్నం, మైసూరు మరియు కోయంబత్తూరు సహా భారతదేశ వ్యాప్తంగా 30 కు పైగా నగరాలలో ఈ సేవలను అందిస్తుంది. ప్రిస్టిన్‌ కేర్‌ కో–ఫౌండర్‌ హర్సిమార్బిర్‌ (హర్ష్‌)సింగ్‌ మాట్లాడుతూ ‘‘శస్త్రచికిత్సా ప్రక్రియను అర్థం చేసుకోవడం, దానిని చేయించుకోవడం చాలామందికి అతి కష్టమైన ప్రక్రియగానే నిలుస్తుంటుంది. ప్రిస్టిన్‌ కేర్‌వద్ద, రోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఇబ్బందులను మేము అర్ధం చేసుకోవడంతో పాటుగా పర్సనల్‌ కేర్‌బడ్డీ సేవల ద్వారా రోగి సంరక్షణకు అమిత ప్రాధాన్యత అందించగలమనే భరోసా అందిస్తున్నాము. ఈ ప్రకటన చిత్రాల ద్వారా సౌకర్యవంతమైన శస్త్ర చికిత్స సేవల అనుభవాలను అందించడంతో పాటుగా ప్రతి అడుగులోనూ దానిని మనోహరమైన రీతిలో వెల్లడించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము’’ అని అన్నారు.

- Advertisement -