తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు నటి సుధ. అటు హీరోలకు, ఇటు హీరోయిన్లకు తల్లి పాత్రలలో సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు. హీరోయిన్గా కేరీర్ ప్రారంభించిన సుధ, తనకు అనుభవమైన సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
తాను తమిళంలో మూడు సినిమాలలో హీరోయిన్గా చేశానని, విలన్ పాత్రలతో అందరిని ఆకట్టుకునే రఘువరన్ హీరోగా చేసిన సినిమాలో ఆయన సరసన నటించానని చెప్పారు. అయితే కొన్ని రోజుల తర్వాత బాలచందర్ నన్ను పిలిపించారు. చూడమ్మా నీ ముఖం హీరోయిన్గా పనికి రాదని మొఖం మీదే చెప్పాశారు అంటూ చెప్పుకొచ్చింది.
నీవు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే క్యారెక్టర్ ఆర్టీస్టు పాత్రలో నటించు.. క్యారెక్టర్ ఆర్టీస్ట్ అయితే నీకు ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చని.. లేదు హీరోయిన్‌గానే చేస్తానంటే ఉండలేవని చెప్పారంది, నీవు చేస్తానంటే హీరోయిన్‌కి సీక్వెల్‌గా సిస్టర్ క్యారెక్టర్ ఉంది, నీకు వారంలో రోజులు సమయం ఇస్తున్నాను ఆలోచించుకుని చెప్పు అన్నారు. ఆ రోజు ఆయన చెప్పడం వల్లే నేను ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పుకొచ్చారు నటి సుధ.