- Advertisement -
ఇటీవలె సినీ నటి రంభ కారుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రంభ, మరో ఇద్దరికీ చిన్న చిన్న గాయాలు అవ్వగా రంభ కూతురు సాషా మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో స్పందించారు నటి రంభ.
సోషల్ మీడియా లైవ్‌లో మాట్లాడుతూ…మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చాను. నాకోసం, నా కుటుంబం కోసం, నా కూతురి కోసం ప్రార్థించిన నా అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను. ఇప్పుడు నా కుటుంబం క్షేమంగా ఉంది. నా కూతురు సాషా కూడా క్షేమంగా ఉంది. తనను ఇవాళే ఇంటికి తీసుకొచ్చాం. మా మీద ఇంత అభిమానం చూపించిన మీ అందరికి ధన్యవాదాలు అని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -