కన్నడ బ్యూటీ ప్రియమణి.. మొదట్లో తన నటన, అందాలతో రెచ్చిపోయింది.కొద్ది పాటి అవకాశాలు దక్కినా కొంత కాలనికి పెద్దగా ఆఫర్స్ ఏమి రాలేదట. దక్షిణాదిలో అన్ని భాషలతోపాటు హిందీలో కూడా సినిమాలు చేసేసింది. అయితే కన్నడ మినహాయిస్తే.. మిగిలిన భాషల్లో ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అనే పేరు తప్ప.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అందుకే మెల్లమెల్లగా శాండల్ వుడ్ కి పరిమితం అయిపోయినా.అప్పుడప్పుడూ ఇతర భాషల సినిమాల్లో నటిస్తున్నా చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదట.
గతేడాది మనవూరి రామాయణం అంటూ తెలుగులో నటించినా.గత రెండేళ్లుగా ఈ సీనియర్ భామ కొత్త సినిమా సైన్ చేయలేదు. 2016లో కన్నడలో మూడు సినిమాలు రిలీజ్ చేసింది. వీటిలో కాంచన2 రీమేక్.. గీతాంజలి రీమేక్ కూడా ఉన్నాయి. అయితే.. ఇవన్నీ అంతకు ముందు ప్రారంభమైనవే. మళ్లీ ఇప్పుడు కొత్త సినిమాకి సైన్ చేసింది ప్రియమణి. ‘ధ్వజ’ అనే కన్నడ మూవీలో ప్రియమణి నటించనుండగా.. ఈ మూవీతో రవిగౌడ అనే హీరో అరంగేట్రం చేయనున్నాడు. ఉగాది నాడు మైసూరులో ఈ ధ్వజ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.
ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా ఇది పొలిటికల్ థ్రిల్లర్ గా తెలకెక్కనుంది. కొత్త దర్శకుడు గిరీష్ ఈ మూవీని తెరకెక్కించనుండగా 50 రోజుల సుదీర్ఘమైన షెడ్యూల్ తో ఈ ధ్వజ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది.