కలెక్షన్లలోనూ రాయుడి హవా..

130
Katamarayudu box office collection

భారీ అంచనాలతో ఇటీవలే విడుదలైన సినిమా కాటమరాయుడు. పవర్‌ పవర్‌ తో ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ ని సంపాధించుకుందనే చెప్పాలి. కాటమరాయుడు గురించి ఎదురుచూసిన పవన్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు తెగ సంబరపడిపోతున్నారు. ఫస్ట్‌ నుంచే భారీ హైప్ క్రియేట్‌ చేసిన కాటమరాయుడు విడుదల తర్వాత కూడా సత్తా చాటుతోంది.

 Katamarayudu box office collection

అయితే ‘కాటమరాయుడు’ విడుదలైన రోజు నుండి పాజిటివ్‌ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతుంది. తమిళ రీమేక్‌గా తెరకెక్కినప్పటికీ, తెలుగు వారికి తగ్గట్లు చేసిన మార్పులు ఫ్యాన్స్‌తో పాటు మిగిలిన ప్రేక్షకులకు కూడా ఆకట్టుకున్నాయి. దీంతో కలెక్షన్లలోనూ దూసుకుపోతున్నాడు కాటమరాయుడు. ఈ నేపథ్యంలో విడుదలైన మూడురోజుల్లోనే ఈ మూవీ ఓవర్సీస్‌లో మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది ఈ చిత్రం.

దీంతో వరుసగా నాలుగోసారి ఈ ఘనతను సాధించాడు పవన్‌. ఇంతకుముందు పవన్‌ నటించిన ‘గబ్బర్‌ సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాలు వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరిన విషయం తెలిసిందే. ఈ మూవీలో పవన్ సరసన శృతీ హాసన్ నటించగా శివబాలాజీ, అజయ్, రావు రమేష్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించారు.