శ్రీవారిని దర్శించుకున్న నటి పూనమ్ కౌర్..

164
poonam
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటి పూనమ్ కౌర్. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ చేనేత కార్మికుల కుటుంబ సభ్యులు బాగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించాను. అలాగే మొదటి సారి వైకుంఠ ఏకాదశి ద్వారంలో దర్శనం చేసుకోవడం చాలా బాగావుంది అని పూనమ్ కౌర్ అన్నారు.

చేనేత కార్మికుల కష్టాలు తొలిగిపోవాలి అని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు. చేనేత పరిశ్రమ పై జిఎస్టీ రద్దు చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. చాలా కాలం తరువాత తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -