టీచర్‌గా మారిన నిత్యా…

37
- Advertisement -

మలయాళ సినీ నటి నిత్యామీనన్‌ తెలుగు, తమిళం, మలయాళ, హిందీ సినిమాలతో నిత్యం బిజీగా ఉండే నిత్యా కాసేపు రిలాక్స్‌ మోడ్‌లోకి వచ్చింది. నిత్యామీనన్‌ షూటింగ్‌ గ్యాప్‌లో టైమ్ దొరికిందని దగ్గరలోని ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్‌ టీచర్‌ అవతారం ఎత్తారు. అది ఎక్కడో తెలుసా… ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాపురంలోని ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్‌ టీచర్‌గా మారి మరీ పిల్లలకు పాఠాలు బోధించారు.

విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగులో వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌లో చేశారు. ఈ సందర్భంగా పోస్ట్‌లో స్పందిస్తూ ఈ చిన్నారులతో కొత్త యేడాదిలో మొదటి రోజు ఇలా గడిచింది అని కామెంటు జోడించారు. ప్రస్తుతం ఈవీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నిత్యాకు ఫిదా అవుతున్నారు.

తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు అంటూ కొందరు కామెంటు చేయగా….మరికొందరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే నిత్యామీనన్‌…రీసెంట్‌గా బీమ్లా నాయక్‌ సినిమాలో పవన్‌కళ్యాణ్‌తో కలిసి నటించింది.

ఇవి కూడా చదవండి…

‘సలార్’ మేకర్స్ క్లారిటీ

స్టార్ హీరో ఆరోగ్య పరిస్థితి విషమం

రెండో పెళ్లిపై మనోజ్ పోస్ట్ ?

- Advertisement -