మళ్లీ తల్లి కాబోతుందా?

27
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మళ్లీ తల్లి కాబోతుందా ?, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అనుష్క శర్మ ఇప్పటికే ఒక పాపకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తన బేబీ వామికతో ఆమె బిజీగా ఉన్నారు. అందుకే, అనుష్క శర్మ సినిమాలకు కూడా దూరంగా ఉంది. ఐతే, ఆ దూరానికి కారణం.. అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అనుష్క శర్మ గర్భవతి అనే విషయం బాలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ లో అనుష్క శర్మ కాస్త లావుగా కనిపించింది. పైగా మొన్న కూడా అనుష్క శర్మ బాగా లూజైన దుస్తులను ధరించి కనిపించింది. దీనికి సంబంధించిన అనుష్క శర్మ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

అయితే, అనుష్క శర్మ వదులైన దుస్తులు ధరించినప్పటికీ ఆమె పొట్టభాగం పెద్దగా ఎత్తుగా కనిపించలేదు. కానీ, అనుష్క శర్మ తన గర్భాన్ని దాచి పెడుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అనుష్క శర్మ మళ్ళీ తల్లి కాబోతుందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది అనుష్క శర్మనే చెప్పాల్సి ఉంది. అయినా ఫలానా హీరోయిన్ తల్లి కాబోతుంది అంటూ ఈ మధ్య బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడం సహజం అయిపోయింది. రీసెంట్ గా దీపికా పడుకోణె తల్లి కాబోతుంది అని రాశారు.

అలాగే మరో హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా తల్లి కాబోతుంది అంటూ పుకార్లు పుట్టించారు. యంగ్ హీరో విక్కీ కౌశల్ ను కత్రినా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ జంట ఇంకా తమ మ్యారేజ్ లైఫ్ ను పూర్తిగా స్టార్ట్ కూడా చేయలేదు. మొత్తానికి పుకార్లు వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో అనుష్క శర్మ గురించి కూడా ఇప్పుడు ఈ వార్త వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -