పెళ్లికి నో.. కానీ 20 లక్షలు పెంచింది

38
- Advertisement -

సీనియ‌ర్ హీరోయిన్ మీనా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే, ఈ సీనియర్ నటి..మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్, సినిమా ఆఫర్లు పెరుగుతుండటంతో సుమారు 20 లక్షల వరకు రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆమె రెమ్యునరేషన్ ఎంత పెంచినా.. నిర్మాతలు అవకాశాలు ఇస్తామని చెబుతున్నారట. అసలు 20 లక్షల ఎమౌంట్ పెద్ద ఎమౌంట్ కాదు అని, కాకపోతే డేట్స్ పెరిగే కొద్దీ రెమ్యునరేషన్ పెంచుకోవచ్చు అని మీనా భావిస్తోందట. భ‌ర్త‌ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మీనా పై ఇలాంటి వార్తలు రావడం విశేషం.

నిజానికి మొన్నటివరకు మీనా రెండో పెళ్ళికి రెడీ అయిందంటూ కథనాలు వచ్చాయి. పైగా మీనా రెండో పెళ్లి పై రోజుకో పుకారు వినిపించింది. దీనికి తోడు మీనాకి ప్రస్తుతం 46 ఏళ్లు మాత్రమే. దీంతో మీనా మళ్లీ పెళ్లి చేసుకుంటేనే బాగుంటుందని.. ఆమె సన్నిహితులు కూడా ఆమెకు సలహాలు ఇచ్చారు. మరోపక్క కుటుంబ సభ్యులు కూడా తమ ఫ్యామిలీ సర్కిల్స్‌లోనే మీనా కోసం ఓ మిడిల్ ఏజ్ మ్యాన్‌ను చూశారట. అతను ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ అని గుసగుసలు వినిపించాయి. త్వరలోనే ఎంగేజ్ మెంట్ అని కూడా ప్రచారం జరిగింది.

అయితే, ఆ తర్వాత ఏం జరిగింది ఏమో గానీ, మీనా మాత్రం మళ్లీ పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. తన భర్త ఆస్తుల విషయంలో తన అత్తమామలతో మీనాకి కొన్ని మనస్పర్థలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని మీనా ఫీల్ అవుతుంది. కాబట్టి.. ఇప్పట్లో తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని మీనా తేల్చి చెప్పింది. ఒంటరిగా బతకడం నరకంలా ఉందని మీనా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధ పడుతూ చెప్పింది. మొత్తానికి మీనా తన దుఖాన్ని దిగమింగుతూ.. తన కూతురు భవిష్యత్తు కోసం మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే తన రెమ్యునరేషన్ ను కూడా పెంచింది.

ఇవి కూడా చదవండి…

బాలకృష్ణతో డ్యాన్స్‌ నాఅదృష్టం: చంద్రిక

ఎన్టీఆర్‌ కోసం బాలీవుడ్‌ విలన్‌..?

పవన్ కళ్యాణ్ కి రష్మిక వృధా

- Advertisement -