ఎన్టీఆర్‌ కోసం బాలీవుడ్‌ విలన్‌..?

46
- Advertisement -

ఆర్ఆర్‌ఆర్ విజయం తర్వాత ఫ్యామిలీతో టూర్‌కు వెళ్లిన జూ.ఎన్టీఆర్….కొరటాల దర్శకత్వంలో వచ్చే సినిమాలో నటించనున్నారు. అయితే ఇప్పటికే అభిమానులకు ఒక రకమైన బేస్‌ను నింపిన కొరటాల… తాజాగా మరోక గుడ్‌ న్యూస్‌ చెప్పనున్నారని టాక్. అయితే ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. ఈ సినిమా కోసం క్యాస్టింగ్ విషయంపై కొరటాల ఒక స్పష్టమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారని టాలీవుడ్‌లో టాక్.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కోసం సమర్థవంతమైన ప్రతినాయకుడి కోసం అన్వేషణ కోనసాగిస్తున్నారు. ఇందుకోసం ఒక బాలీవుడ్‌ నటుడ్ని సంప్రదించాలని ప్రయత్నిస్తున్నారు. అతనే…బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌. ఎన్టీఆర్‌తో సైఫ్‌ను ఒప్పించాలని  కొరటాల రెడీ అవుతున్నాడట. అయితే సైఫ్ ఇప్పటికే ప్రతినాయక ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తున్నారు.

ఆదిపురుష్‌ సినిమాలో లంకేశ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో లుక్‌, గెటప్‌ను మార్చనున్న ఎన్టీఆర్…హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టాలి. ఇప్పటి వరకు హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు  అనేది ఇంకా కన్ఫం కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి…

ఒక్క ప్లాప్ మరెన్నో ప్రశ్నలు

నువ్వే నా ప్రాణం! ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌

బాలయ్య ఈవెంట్‌కు ప‌వ‌న్?

- Advertisement -