అసత్య ప్రచారం చేయకండి: మీనా

50
meena
- Advertisement -

తన భర్త మృతి విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు నటి మీనా. జూన్ 29న మీనా భర్త ఊపిరితిత్తుల సమస్యతో మరణించారు. దీంతో ఆయనపై మరణంపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి.

మీనా ఇంటికి సమీపంలో ఎక్కువ సంఖ్యలో పావురాలు ఉన్నాయని.. వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లనే విద్యా సాగర్‌కు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని పలు పత్రికలు, వెబ్‌సైట్స్‌లో కథనాలు వెలువడ్డాయి.ఈ నేపథ్యంలోనే స్పందించారు మీనా.

తన భర్త మరణంతో తీవ్ర విచారంలో ఉన్నామని ….పరిస్థితిని అర్థం చేసుకుని మీడియా సంయమనం పాటించాలన్నారు. మాకు గోప్యతనివ్వాలి. నా భర్త మృతి విషయంలో ఎటుంటి అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు.ఇలాంటి సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిర వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. మీనాకు, విద్యాసాగర్‌తో 2009లో పెళ్లి అయింది.వీరికి ఒక కూతురు ఉంది.

- Advertisement -