హిమాల‌యాల్లో హీరోయిన్ జ్యోతిక‌ అడ్వెంచ‌ర్..

105
- Advertisement -

హీరోయిన్ జ్యోతిక‌ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసిందామె. జ్యోతిక ఇటీవ‌ల హిమాల‌య ప‌ర్వతా‌ల‌కు వెళ్లింది. అక్కడి ప్ర‌కృతి అందాల‌తో దిగిన ఫొటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ రోజు పోస్ట్ చేసింది. స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున అడ్వెంచ‌ర్ ట్రిప్‌కు వెళ్లిన జ్యోతిక‌.. త్రివ‌ర్ణ ప‌తాకంతో త‌నలో ఉన్న దేశ‌భ‌క్తిని చాటింది. క‌శ్మీర్‌లోని సుంద‌ర స‌ర‌స్సుల మ‌ధ్య త‌న టీమ్‌తో దిగిన కొన్ని ఫోటోల‌ను ఆమె షేర్ చేసింది.

బికాత్ అడ్వెంచ‌ర్స్ టీమ్‌లోని స‌భ్యుల‌తో ఆమె ఈ యాత్ర చేప‌ట్టింది. హ‌లో ఎవిరివ‌న్ అంటూ త‌న పోస్టులో పేర్కొన్న జ్యోతిక‌.. త‌న లాక్‌డౌన్ డెయిరీల్లోంచి కొన్ని పాజిటివ్ అంశాల‌ను పోస్టు చేస్తున్న‌ట్లు చెప్పింది. జీవితం వాస్త‌విక‌మైన‌ద‌ని, కానీ జీవించ‌డం ప్రారంభించాకే ఆ విష‌యం తెలుస్తుంద‌న్న ఉద్దేశాన్ని ఆమె త‌న పోస్టులో పేర్కొన్న‌ది. భార‌త్ అత్యంత ర‌మ‌ణీయంగా ఉన్న‌ట్లు కూడా త‌న ఇన్‌స్టాలో జ్యోతిక‌లో అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. సుంద‌ర‌ క‌శ్మీరీ గ్రేట్ లేక్స్ ప్రాంతాల్లో సాగిన అడ్వెంచ‌ర్‌కు సంబంధించిన ఫోటోల‌ను జ్యోతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూడ‌వ‌చ్చు.ఆమె దిగిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

- Advertisement -