ఎన్టీఆర్‌తో ఎలాంటి విబేధాలు లేవు- బండ్ల గణేష్‌

107
Bandla Ganesh
- Advertisement -

టాలీవుడ్‌ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బండ్ల గణేష్‌.. కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారాడు. బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు. పరమేశ్వర ఆర్ట్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. 2015లో ‘టెంపర్’ సినిమా తర్వాత మరో చిత్రాన్ని నిర్మించలేదు.

‘టెంపర్’ సినిమా సమయంలో ఎన్టీఆర్‌తో బండ్ల గణేష్‌కు ఏవో గొడవలు జరిగినట్లు అప్పట్లో కథనాలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో బండ్ల గ‌ణేష్‌ మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల అలా జరిగింది. ఇది గొడ‌వ కాదు. ఎన్టీఆర్‌తో నాకు ఎలాంటి విబేధాలు లేవంటూ చెప్పుకొచ్చారు బండ్ల‌.

- Advertisement -