రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడింది:జీవిత

170
rajashekar
- Advertisement -

కరోనాతో తీవ్ర అస్వస్థత పాలైన హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు ఆయన భార్య,సినీ నటి జీవిత. ఆయ‌న త్వరగా కోలుకుంటున్నార‌ని చెప్పారు. డాక్ట‌ర్లు మెరుగైన చికిత్స అందిస్తుండ‌టంతో విషమ పరిస్థితి నుంచి బయటపడ్డార‌ని తెలిపారు.

స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహనటులు, అభిమానులు చేసిన ప్రార్థనలు కారణంగానే రాజశేఖర్ క్షేమంగా ఉన్నారని జీవిత పేర్కొన్నారు.త్వరలోనే ఐసీయూ నుంచి బయటకు వస్తారని…వెంటిలేటర్ మీద రాజశేఖర్‌కు చికిత్స అందిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు జీవిత.

రాజ‌శేఖ‌ర్‌ ఎప్పుడూ వెంటిలేటర్‌పై లేర‌ని వెల్లడించారు. నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించార‌ని….క్ర‌మంగా ఆక్సిజ‌న్ సపోర్ట్ తగ్గిస్తూ చికిత్స చేస్తున్నార‌ని తెలిపారు.

- Advertisement -