శివాజీరాజాకి ‘మా’ వార్నింగ్

358
naresh jeevitha
- Advertisement -

మా ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్ ఓడిపోవడంతో తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నాగబాబు వర్సెస్ శివాజీరాజాగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీరాజా కాస్త శృతిమించి నాగబాబుకి అంగవైకల్యం ఉందని అందుకే సరిగా నడవలేరని కామెంట్ చేయడం వివాదాస్పదంగా మారింది.

ఈ నేపథ్యంలో శివాజీరాజాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మా అధ్యక్షుడు నరేష్, ప్రధానకార్యదర్శి జీవిత. నాగబాబుకి అంగవైకల్యం, నడవలేకపోతున్నారంటూ కామెంట్స్ చేయడం ఆర్టిస్ట్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడమేనన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని… ఎంపీగా కూడా పోటీ చేశారని చెప్పారు.

నాగబాబు ‘మా’ ప్రెసిడెంట్‌గా చేసినప్పుడు చాలా మందికి పెన్షన్‌తో పాటు సభ్యత్వాలు ఇప్పించారు. చేతనైన సాయం చేశారని తెలిపారు. నాగబాబు పిల్లికి భిక్షం పెట్టలేదన్నారు. కాని ఆయన పోటీలో లేకపోయినప్పటికీ సొంతంగా రూ. 6 లక్షల రూపాయిలు డొనేట్ చేశారని చెప్పారు. ఎవర్నీ వ్యక్తిగతంగా దూషించవద్దని శివాజీరాజాకు సూచించిన నరేష్ వివాదాల్లోకి ‘మా’ని లాగొద్దని సలహాఇచ్చారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అద్భుతమైన సోషల్ ఆర్గనైజేషన్ అని తెలిపిన నరేష్ ఆరోగ్యకరమైన వాతావరణంలో రెండేళ్లు మంచి పనులు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

- Advertisement -