రేటు పెంచిన జాన్వీ కపూర్‌

37
- Advertisement -

అందానికి బ్రాండ్‌ అంబాసీడర్‌.. అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఈ అమ్మడిని సంప్రదించారు. అయితే తెలుగులో నటించడానికి ఈ అమ్మడు భారీగానే డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ- యంగటైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న సినిమాలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో నటించడానికి జాన్వీ కపూర్‌ ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ కాంబో ఓ ఏంజ్‌ లో ఉండబోతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎన్టీఆర్‌ కెరియర్‌ లోనే మెమరబుల్‌ గా నిలవాలని తారక్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ మాస్ రోల్‌ లో కనిపించనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు క్లాస్‌ రోల్స్‌ చేసిన జాన్వీ కెరియర్‌ కి మరింత ప్లస్‌ కానుందని తెలుస్తోంది.

- Advertisement -