సావిత్రి మా ఇంటికి వచ్చి పెద్దగా ఏడ్చేసింది-జమున

611
actress Jamuna Say To Savithri Reallife
- Advertisement -

సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొంది విడుదలై ప్రేక్షకుల ఆధరాభిమానాలు పొందుతున్న చిత్రం మహానటి. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. అయితే సావిత్రి గురించి బయోపిక్ లో ఎన్నో విషయాలు చూపించాడు దర్శకుడు. అయితే తాజాగా ఆమె గురించి సీనియర్ నటి జమున ఒక విషయాన్ని తెలియజేసింది. ఒకరోజు సావిత్రి మా ఇంటికి వచ్చి.. నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసిందని తెలిపింది.

మా అబ్బాయిని ఉయ్యాలలో వేసే ఫంక్షన్ రోజున సావిత్రి మా ఇంటికి వచ్చింది. ఆమె వచ్చే ముందే ఫుల్ డ్రింక్ చేసి వచ్చింది. మా బాబుని ఎత్తుకుని కొద్దిసేపు వాణ్ణి ఆడించి మళ్లీ ఉయ్యాలలో వేసింది. తర్వాత నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసిందని సీనియర్ నటి జమున ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

నువ్వు చాలా అదృష్టవంతురాలివి చెల్లి. మంచి భర్త.. బంగారం లాంటి కొడుకు లభించారంటూ అంటూ ఏడ్చేసింది.  జెమినీ అలా చేశాడు. ఇలా అన్నాడు అంటూ బోరున విలపించిందని పేర్కొన్నారు. జెమినీని చేసుకోద్దని ముందే అందరూ చెప్పారు. అయినా వినకుండా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అనుభవిస్తున్నావు. అయ్యిందేదో అయిపోయింది కష్టమో.. నష్టమో భరించాలి. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల కోసమైన నీవు ధైర్యంగా ఉండాలని, ఇక నీ జీవితానికి వాళ్లే సంతోషాన్ని ఇస్తారని ఓదార్చి, ధైర్యం చెప్పానని జమున చెప్పింది.

- Advertisement -