తల్లి కాబోతున్న మహేష్ హీరోయిన్..

130
amrutha rao

బాలీవుడ్‌ హీరోయిన్‌ అమృతా రావు తల్లి కాబోతోంది. 2016లో అన్మోల్ అనే రేడియో జాకీని ఆమె పెళ్లి చేసుకుంది. అమృత తల్లి అవుతున్నట్టు దంపతులిద్దరూ ఇంకా ప్రకటించలేదు. అయితే మెడికల్ చెకప్ కోసం వారు బయటకు వచ్చినప్పుడు… బేబీ బంప్ తో ఉన్న అమృత మీడియా కంటికి చిక్కింది. ఆసుపత్రి వద్ద వీరిద్దరూ నిల్చున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతిథి’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తన సినిమా మాదిరే అతిథిలా వచ్చి.. అతిథిలా వెళ్లిపోయింది. బాలీవుడ్ లో మాత్రం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ‘మై హూనా’ ‘షికార్’ ‘వివాహ్’ ‘హే బేబి’ ‘లైఫ్ పార్ట్నర్’ ‘జాలీ ఎల్ఎల్బీ’ ‘సత్యాగ్రహ’ ‘థాకరే’ తదితర చిత్రాల్లో నటించింది. 2016లో ఆర్ జె అన్ మోల్ ని వివాహం చేసుకున్న అమృతా రావ్ ఇప్పుడు తల్లి కాబోతోందని తెలుస్తోంది.