శ్రీరెడ్డిలా అన్నీ విప్పుకుని రోడ్డెక్కలేనుః నటి షకీలా

824
Srireddy Shakeela
- Advertisement -

క్యారెక్టర్ ఆర్టీస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించి..శృంగార తారగా పేరు తెచ్చుకుంది షకీలా. కెరీర్ మొదట్లో బాగానే అవకాశాలు వచ్చినా ..ఆమెకు శృంగార తార అనే ట్యాగ్ లైన్ రావడంతో రాను రాను అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె పరిస్ధితి మరింత ఘోరంగా మారింది.తాజాగా సంపూర్ణేశ్ బాబు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది షకీలా.

కొబ్బరిమట్టలో సంపూర్ణేష్ బాబు తల్లిగా నటించింది. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది షకీలా. క్యాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా.. నేను శృంగార తారగా అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఇండస్ట్రీ నుండి లైంగిక వేధింపులు ఎదురుకాలేదు.

కెమెరా ముందు నేను అర్ధనగ్నంగా నటించడానికి నేను ఇబ్బంది పడలేదు. పాపం శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని రోడ్డుమీద నిలబడలేను. నా చేతుల కష్టంపై ఫైట్ చేసి వెనక్కి రాగలిగాను అన్నారు. నాకు శృంగార తార అనే బ్రాండ్ ఉంది కాబట్టి పెద్దగా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదన్నారు.

- Advertisement -