బర్నింగ్ స్టార్‌ సంపూ…. వరల్డ్ రికార్డ్

483
sampoornesh babu
- Advertisement -

హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన హీరో సంపూర్ణేష్ బాబు. తాజాగా మూడు డిఫరెంట్స్ షేడ్స్ ఉన్న పాపారాయుడు,పెదరాయుడు,ఆండ్రాయుడు అంటూ కొబ్బరిమట్టగా ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు.

కొబ్బరిమట్టతో వరల్డ్ రికార్డు సృష్టించబోతున్నాడు సంపూర్ణేష్ బాబు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఆండ్రాయిడ్‌ పరిచయ ట్రైలర్‌లో 3.27 నిమిషాల నిడివి గల డైలాగును సంపూ సింగిల్ టేక్‌లో చెప్పారట.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకుడిగా ‘హృద‌య‌కాలేయం’ సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ క‌థ‌, క‌థ‌నం, మాట‌లు అందించిన ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదలకాబోతుంది.

- Advertisement -