గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రోజురోజు డిమాండ్ పెరిగిపోతుంది. రోజువారిగా మొక్కల నాటుతూ వాటి ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. డైరెక్టర్‌గా సినీ జీవితం ప్రారంభించి పాన్ ఇండియా విలన్‌గా ఎదిగిన సముద్రఖని…తాజాగా హైటెక్ సిటీలోని శిల్పారామంలో రావి మొక్కను నాటారు.
ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు. ప్రకృతి పచ్చగా ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని అన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్’ను గొప్ప సామాజిక ఉద్యమంగానే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగానూ తీర్చిదిద్దిన అధినేత జోగినపల్లి సంతోష్ కుమార్ మరియు నిర్వాహకుల నిరంతర కృషి ఎంతో ప్రశంసనీయం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను నా ఇంటి నుంచే మొదలు పెడుతున్నాను. ఈ బృహత్తర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నా కుమారుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీ మరియు ప్రముఖ దర్శకులు హెచ్.వినోత్ లకు సినీ నటుడు సముద్రఖని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ను విసిరారు.
ఇవి కూడా చదవండి…