హెబ్బా పటేల్‌ అందాల విందు…

14
- Advertisement -

చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్‌ ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఈ రంగుల ప్రపంచంలో ఎంత గ్లామర్‌ గా కనిపిస్తే అన్ని అవకాశాలు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరోయిన్స్ కెరియర్‌ ఒకసారి ఫేడవుట్‌ అయిపోతే ఇక అంతే సంగతి.. వారికి అవకాశాలు రావడం కష్టమనే చెప్పాలి. ఒకవేళ అడపాదడపా అవకాశాలు వచ్చిన అవి అంతంత మాత్రమే. అందుకే హీరోయిన్స్‌ తమ గ్లామర్‌ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయినా కొంత మంది హీరోయిన్లకు గ్లామర్‌ ఉన్నా.. అందాలను ఆరబోసేందుకు సిద్ధమైనా.. అవకాశాలు మాత్రం రావు.. అదే కోవకు చెందుతోంది నటి హెబ్బా పటేల్‌..

అలా ఎలా మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… కెరియర్‌ మొదట్లో హిట్‌ సినిమాలతో దూసుకుపోయినా… ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్‌ కావడంతో హెబ్బా జోరుకు బ్రేక్‌ పడింది. గ్లామర్‌ డోస్‌ పెంచి పలు సినిమాల్లో అందాలను ఆరబోసినా.. అవకాశాలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదనే చెప్పాలి. ఆతర్వాత డీ గ్లామరస్ గా నటించి ఓదెల రైల్వే స్టేషన్‌ సినిమాలో నటించింది. అయితే.. ఎంత ప్రయత్నించినా.. ఈ అమ్మడికి అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ ముద్దుగుమ్మ… హాట్ ఫోటో షూట్లతో పిచ్చెక్కించే పోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారును గుక్కతిప్పుకోకుండా చేస్తోందనే చెప్పాలి. ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ గా మారాయి.

- Advertisement -