నేను కూడా మోదీని ఫాలో అవుతానుః నాగబాబు

454
Modi Nagababu
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్టర్ లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఆదివారం నుంచి ఫేస్ బుక్, ట్వీట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ కు దూరంగా ఉండాలని నిర్చయించుకున్నట్లు తెలిపారు. అయితే మోదీ పెట్టిన ట్వీట్ పై పలువురు రాజకీయ నాయకులు, సెల్రబెటీలు స్పందిస్తున్నారు. తాజాగా మోదీ తీసుకున్న నిర్ణయంపై స్పందించారు నటుడు, జనసేన నేత నాగబాబు.

ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం సరైందేనన్నారు. తాను కూడా మోదీని ఫాలో అవ్వాలనుకుంటునున్నానని ప్రకటించారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం నాగబాబు అదిరింది షో జడ్జ్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొవడం వల్లే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసుంటాడని పలువురు ఆరోపిస్తున్నారు.

- Advertisement -