హాస్యనటుడు ఆలీ ఇంట విషాదం..

59
ali

ప్రముఖ సినీ నటుడు అలీ తల్లి జైతున్ బీబీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న ఆలీ.. రాంచీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు.

ali

ఆలీ జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా.. జైతున్ బీబీ భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం.