మళ్లీ పెరిగిన లోన్ యాప్ ఆగడాలు..

33
acp

లోన్ యాప్‌ల పేరుతో ఆగడాలు మళ్లీ పెరిగాయన్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్. మీడియాతో మాట్లాడిన ఆయన..ఇప్పటికి ఆరు కేసులు నమోదు చేశామన్నారు. 2 కేసులో లోన్ తీసుకోకుండానే డబ్బులు కట్టాలని బెదిరింపులకు పాల్పడ్డారని..వేరే ప్రాంతాల్లో ఉండి ఈ మాఫియా కార్యకలాపాలు సాగిస్తుందన్నారు.

ప్రైవేట్ లింక్స్ పంపి లోన్ యాప్ మాఫియా కొత్త మోసానికి తెర తీసిందని….గత సంవత్సరం ఇదే సమయంలో లోన్ అప్ ఆర్రస్మెంట్ కేసులు 28 బుక్ చేశాము.అందులో 22మంది నిందితులను కూడా అరెస్ట్ చేశామని వెల్లడించారు. హైదరాబాద్ లోని లోన్ యాప్ కంపెనీలకు చెక్ పెట్టాం అని…యాప్ డౌన్ లోడ్ సమయం లోనే అప్రమత్తంగా ఉండాలన్నారు.

గతంలో గూగుల్ ప్లే స్టోర్ లో 300కు పైగా యాప్స్ లు ఉండేవని…ఇప్పుడు అన్ని యాప్స్ లేవన్నారు ఏసీపీ. త్వరలోనే లోన్ యాప్ నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.