మొక్కలు నాటిన అచ్చంపేట ఎమ్మార్వో చంద్రశేఖర్…

356
achampet mro chandrashekar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు అచ్చంపేట ఎమ్మార్వో డి చంద్ర శేఖర్.
అచ్ఛంపేట ఆర్డీవో పాండు విసిరిన ఛాలెంజ్ స్వీకరించి తన కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మార్వో చంద్ర శేఖర్ మాట్లాడుతూ కేసీఆర్ గారి ద్రుష్టి తో చేపట్టిన హరిత హారం భవిష్యత్ తరాలకు పచ్చని బంగారు బాట , ఇప్పుడు పచ్చదనం కోసం మరో అద్భుతమైన కార్యక్రమం పల్లె ప్రకృతి వనాలను Palle Prakruthi Vanams (forest-cum-park) అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తుందన్నారు.

తెలంగాణ మొత్తం 12000 గ్రామ పంచాయితిలకు పల్లె ప్రకృతి వనాలు తీసుకొస్తున్నారంటే కేసీఆర్ పర్యావరణం పైన , అడవుల పెంపకం పైన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలనే దూరదృష్టి అద్భుమైనది . దీనికి తోడు ఎంపీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం , వాటిని కాపాడే బాధ్యత , పర్యావరణ పరిరక్షణకి తీసుకుంటున్న చొరవ అభినందనీయం . ఇలాంటి మంచి కార్యక్రమానికి మావంతు సహకారం , బాధ్యత ఎల్లపుడూ ఉంటుందన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలానే కొనసాగాలని నేను ఈ ఛాలెంజ్ ని మరో ముగ్గురు అదే విధంగా వారు గ్రీన్ ఛాలెంజ్ లో ముగ్గురునీ 1 అచ్చంపేట ఎసై ప్రదీప్ , 2, లింగాల తహసీల్దార్ మల్లికార్జున్ , 3, ఉప్పునూతల తహసీల్దార్ కృష్ణయ్య గార్లను నామినేట్ చేయడం జరిగిందన్నారు.

- Advertisement -