తెలుగు రాష్ట్రాలకు అభినందనలు: వెంకయ్య

138
venkaiah naidu

ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాలు టాప్ పొజిషన్‌ నిలవడంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన వెంకయ్య…భారత ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, మూడవ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు అని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకం అన్నారు.