రెండు ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టిన జక్కన్న

183
- Advertisement -

రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి 2’ సినిమా విడుదలైన ప్రతి చోటా విజయ విహారం చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకుంది. అసలు పోటీ అనేదే లేకుండా ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీసును షేక్ చేసింది. విడుదలైన ప్రతి భాషలో రికార్డు కలెక్షన్లను రాబడుతు సరికొత్త చరిత్రను సృష్టించింది. విడుదలైన తొలి రోజునే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 194 కోట్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్లవరకూ వసూలు చేసిన ఈ సినిమా.

అయితే బాహుబలి కోసం ఎస్ఎస్ రాజమౌళి అండ్ టీం ఐదేళ్ల పాటు శ్రమించింది. తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్నే అందుకుంది. ఇటు పేరు ప్రఖ్యాతులు ఆర్జించడంతో పాటు ఆర్థికంగా కూడా బాహుబలి బాగానే హెల్ప్ చేసింది. బాహుబలి2 రిలీజ్ అయి.. రెండు నెలలకు పైగా సమయం గడిచిపోయింది. ఇంకా జక్కన్న కొత్త ప్రాజెక్ట్ ఏంటనే విషయం తెలియలేదు.

About SS Rajamouli Next Movie

‘బాహుబలి తర్వాత చాలా మారిపోయాయని చాలా మంది అనుకోవడం సహజం. ఇప్పుడు నా దగ్గర నాకంటూ కాస్త ఎక్కువ టైం ఉందంతే. ఇంకా పెద్ద ప్రాజెక్టులు. ఇంకా పెద్ద స్థాయిలో తీసే ఆలోచనలు ఉన్నాయి. నేను విజయం సాధిస్తానా లేదా అని కాలమే చెప్పాలి. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాననే భావన కొంత ఉంది. అయితే ఇది ఖాళీగా ఉన్నాననా లేక సంతృప్తిగా అనిపిస్తోందా అని మాత్రం చెప్పలేకపోతున్నా’ అన్న రాజమౌళి.. బాహుబలి తెచ్చిన డబ్బుల్లో తన ఖాతాలోకి వచ్చిన వాటా ఓ చిన్న భాగం మాత్రమే అంటూ నవ్వేశాడు.

‘ఓ అద్భుతమైన కల సాకారమైంది. సమయం వచ్చినపుడు నా తర్వాతి ప్రాజెక్టు మొదలవుతుంది. నాకు రెండు కమిట్మెంట్స్ ఉన్నాయి. కానీ వీటిపై ఇప్పుడే మాట్లాడ్డం సాధ్యం కాదు. ఇంకా చాలానే వర్క్ జరగాల్సి ఉంది’ అన్నాడు దర్శకధీరుడు రాజమౌళి. దంగల్ మూవీతో చైనాలో మనకు ఓ కొత్త మార్కెట్ కు ద్వారాలు తెరిచాడంట.. ఆమిర్ ఖాన్ పై ప్రశంసలు కురిపించిన జక్కన్న.. దంగల్ తర్వాత చైనా వెళ్తున్న బాహుబలి2కి.. ఆ సినిమా సాధించిన విజయం హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. భారత్‌లో 1050 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది బాహుబలి. ఇటు తెలుగు రాష్ట్రాలు స‌హా అటు బాలీవుడ్‌లోనూ నంబ‌ర్ వన్‌ వ‌సూళ్ల సినిమాగా రికార్డులు తిర‌గ‌రాసి ఇండియా సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

- Advertisement -