బాలయ్య యాక్షన్‌కి బాలీవుడ్‌ బ్యూటీ రియాక్షన్‌..

205
- Advertisement -

బాలకృష్ణ- శ్రియ జంటగా ‘పైసా వసూల్’ సినిమా డైరెక్టర్‌ పూరీ తెరకెక్కిస్తున్నాడు .ఈ సినిమాలో బాలయ్య మాఫియా డాన్‌లా కనించనున్నాడు. ఇందు కోసం తన గెటప్ పూర్తిగా మార్చాడు. బాలయ్య సినిమాలు అంటే యాక్షన్ తప్పనిసరి. యాక్షన్ కోసం ఎంతటి రిస్క్ అయన చేస్తాడు బాలయ్య. లెజెండ్‌లో, తన 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి లో బాలయ్య యాక్షన్ సన్నివేశాలలో చూపిన తెగువకు అందరూ ఆశ్చర్య పోయారు అని చెబుతుంటారు.

Paisa Vassol item song with Kyra Dutt

అయితేఇప్పుడు వస్తున్న ‘పైసా వసూల్’లో కూడా అటువంటి సాహసమే చేస్తున్నాడు. ఆ మధ్య పోర్చుగల్ దేశంలో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్లో కూడా బాలయ్య ఒక కార్ యాక్షన్ సీక్వెన్స్ లో చాలా రిస్క్ తీసుకొని తానే సొంతంగా చేశాడు. అప్పుడు అక్కడే ఉన్న నటి శ్రియ షాక్ కు గురైంది బాలయ్య పట్టుదల చూసి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇదే సినిమా కోసం మరో యాక్షన్ సన్నివేశంలో బాలయ్య మరో స్టంట్ చేశాడు డూప్ లేకుండా. ఈసారి తన మరో హీరోయిన్ కైరా దత్ తో కలిసి చేశాడు. అక్కడ ఈ కొత్త అమ్మడు బాలయ్య యాక్షన్ చూసి ఇలాంటి రియల్ యాక్షన్ హీరోని నేను ఎప్పుడు చూడలేదు అంటూ షాకైపోయింది ఈ సెక్సీ దత్.

Paisa Vassol item song with Kyra Dutt

బాలయ్య ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌కి ఎటువంటి డూప్ లేకుండానే ఎంతటి కష్టమైన యాక్షన్ షాట్ అయినా తానే చేస్తున్నాడు.అది చూసి ”బాలకృష్ణ నిజమైన రియల్ హీరో అని తెగ తబ్బిబ్బు అయి చెబుతోంది ఈ అమ్మడు. ఈ సినిమాలో శ్రియ తో పాటుగా మరో కొత్త నటి ముస్కాన్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఐటం సాంగ్ కోసం వచ్చిన కైరా కొన్ని సీన్లలో కూడా చేస్తోందట.

- Advertisement -