మహా రాజాకీయాలపై నేడు సుప్రీంలో విచారణ

456
supreme court
- Advertisement -

మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకో మలుపుతిరుగున్నాయి. శివసేన, ఎన్సీపీలకు షాకిస్తూ అజిత్ పవార్ తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈమేరకు నిన్న ఉదయం రాజ్ భవన్ లో ఫడ్నివిస్ తో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్. ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే ఫడ్నవిస్ , ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ లు ప్రమాణం చేశారు.

కాగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయడంతో సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ ఫిర్యాదు పై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ఉదయం 11:30 లకు జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఈకేసుపై విచారించనుంది. మహారాష్ట్ర గవర్నర్ తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించనున్నారు. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తరపున అభిషేక్ మను స్వింగ్వి వాదనలు వినిపించనున్నారు. సుప్రీం తీర్పుపై మహారాష్ట్రలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -