రాహుల్ సిప్లిగంజ్ ను చిత్తు చేసిన శ్రీముఖి..ఇదిగో సాక్ష్యం

854
Srimukhi Rahul
- Advertisement -

బిగ్ బాస్ 3 టైటిల్ ను రాహుల్ సిప్లిగంజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టైటిల్ గెలిచిన తర్వాత బయట రాహల్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అంతేకాకుండా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక బిగ్ బాస్ 3లో రన్నరప్ గా నిలిచిన శ్రీముఖికి కూడా అంతకుముందే చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ 3 టైటిల్ తనకు వస్తుందని మొదటి నుంచి గట్టి నమ్మకంతో ఉంది శ్రీముఖి. అయితే శ్రీముఖి రాహుల్ ల మధ్య గొడవలు కావడంతో అది కాస్త రాహుల్ కు ప్లస్ గా మారి రాహుల్ ఆర్మీ పేరుతో చాలా మంది ఆయనకు ఓట్లు వేశారు. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్ మా కు ప్రతి ఒక్కరు ఇంటర్వూలు ఇచ్చారు.

Biggboss3 telugu

ఇందులో భాగంగా చివరగా శ్రీముఖి ఇంటర్వూను అప్ లోడ్ చేశారు స్టార్ మా యాజమాన్యం. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి ఇంటర్వ్యూలు అప్ లోడ్ చేసిన తర్వాత వ్యూస్ పరంగా చూస్తే శ్రీముఖిని కనీసం రీచ్ కూడా కాలేకపోయాడు రాహుల్. ఇక ఈ ఇద్దరి ఇంటర్వ్యూలు ఇప్పుడు యూ ట్యూబ్‌లో సందడి చేస్తున్నాయి. ముందు విన్నర్‌గా నిలిచిన రాహుల్ ఇంటర్వ్యూ కంటే తర్వాత అప్ లోడ్ చేసిన శ్రీముఖి ఇంటర్వ్యూ వైపు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. రాహుల్ ఇంటర్వ్యూకు 6 రోజుల్లో 4 లక్షల వ్యూస్ మాత్రమే రాగా.. శ్రీముఖి ఇంటర్వ్యూకు మాత్రం కేవలం ఒక్క రోజులోనే 5 లక్షల వ్యూస్ దాటేసి సత్తా చూపించింది. దీంతో శ్రీముఖి అభిమానులు నైతిక విజయం తమదేనని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు.

srimukhi completely dominating bigg boss 3 winner rahul sipligunj

- Advertisement -