I.N.D.I.A కూటమి నుంచి అప్ ఔట్ ?

36
- Advertisement -

ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ? అప్ మరియు కాంగ్రెస్ మద్య దోస్తీ కుదరడం లేదా ? అంటే తాజాగా జరుతున్న పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. డిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అప్ కు కాంగ్రెస్ మద్దతు పలకడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో చేరింది. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఈ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో ఇప్పటికే 26 పార్టీలు పొత్తులో ఉన్నాయి. అయితే అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు మొదటి నుంచి సమ దూరం పటిస్తున్న అప్.. ఇండియా కూటమిలో భాగమౌతుందని ఎవరు ఊహించి ఉండరు. .

ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ తరువాత ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని మొదటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ డిల్లీలో కేజ్రివాల్ సర్కార్ ను ఇరుకున పెట్టె విధంగా కేంద్ర ప్రభుత్వం డిల్లీ ఆర్డినెన్స్ చట్టాలను తీసుకురావడం. వాటికి వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కోసం అప్ ప్రయత్నించడం దాంతో వేరే దారిలేక విపక్షాలతో పాటు ఇండియా కూటమిలో భాగమైంది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే అప్ ఎక్కువ రోజులు కూటమిలో కొనసాగేలా కనిపించడం లేదు.

ఇప్పటికే డిల్లీలో పొత్తుతో సంబంధం లేకుండా ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు అప్ ప్రకటించి ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు షాక్ ఇచ్చింది. ఇక ఈ ఏడాది చివర రాజస్తాన్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్ స్వతంత్రంగానే బరిలోకి దిగే ఆలోచనలో ఉండని టాక్. తాజాగా రాజస్తాన్ అప్ ఇంచార్జ్ వినయ్ మిశ్రా చేసిన మాట్లాడుతూ.. రాజస్తాన్ లో అప్ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా కూటమితో కలిసి పోటీ చేస్తుందా అనే దానిపై క్లారీతి లేదని. కానీ అన్నీ స్థానాల్లో పోటీ చేసేందుకు అప్ సిద్దంగా ఉందని చెప్పుకొచ్చారు. దీంతో తాజా పరిస్థితులు గమనిస్తే ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:కే‌సి‌ఆర్ హ్యాట్రిక్ ఖాయమేనా ?

- Advertisement -