కేజ్రీవాల్ బయటకు వస్తే..బీజేపీకి ముప్పే!

12
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో భాగంగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ హస్తం ఉందని ఈడీ రిమాండ్ విదించింది. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఇదంతా బీజేపీ ఆడుతున్న కుట్ర అని కేజ్రీవాల్ చెబుతూ వస్తున్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేశారు, దీంతో తాజాగా కేజ్రీవాల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ వేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. ఈ నెల 24 లోపల ఈడీ తప్పనిసరిగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈడీ కౌంటర్ పిటిషన్ లో ఎలాంటి విషయాలు వ్యక్తీకరించనుందనేది ఆసక్తికరంగా మారింది. .

ఇకపోతే కేజ్రీవాల్ ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే ఆయనను అరెస్టు చేశారని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించినట్లు సమాచారం. దీంతో కేజ్రీవాల్ ను ఎన్నికల ప్రచారానికి దూరం చేసేందుకే అరెస్ట్ అంశం తెరపైకి వచ్చిందా అనేది దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ మాత్రమే ఉన్న సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయా రాష్ట్రాల్లో బలపడుతూ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ వచ్చింది.

ఇదిలా ఉంచితే అప్ మరియు కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగం కావడంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపించాయి. దీంతో వ్యూహాత్మకంగా కేజ్రీవాల్ ను లిక్కర్ స్కామ్ లో జైలు కు పంపించడంతో ఇండియా కూటమి బలహీన పడడంతో పాటు ఆమ్ ఆద్మీ కూడా సంక్షోభంలో పడిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఎన్నికల ముందు కేజ్రీవాల్ బయటకు వస్తే ఆయనపై సానుభూతి ఏర్పడి బీజేపీకి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు, ఎందుకంటే బీజేపీ అక్రమ ఆరోపణల కారణంగానే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడనే అంశం బలంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి కేజ్రీవాల్ బయటకు వస్తారా ? లేదా అనేది చూడాలి.

Also Read:వేసవిలో చెరుకురసం తాగుతున్నారా?

- Advertisement -