43మంది ఎమ్మెల్యేలకు బీజేపీ ఆఫర్!

152
- Advertisement -

బీజేపీ నీచ రాజకీయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ లోటస్ ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో బట్టబయలు చేశారని అన్నారు ఆప్ ఎమ్మెల్యే అతిషి. బీజేపీలో చేరేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆఫర్ ఢిల్లీ డిప్యూటీ సీఎం ముందుకు కూడా వచ్చాయని అన్నారు. మొత్తం సీబీఐ, ఈడీ కేసులు మూసేస్తం… బీజేపీ నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. మనిష్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించేందుకు పిలిచిన సమయంలో కూడా ఇదే ఆఫర్ చేశారు. పంజాబ్ లో కూడా ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.25కోట్లను ఆఫర్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆపరేషన్ లోటస్ బట్టబయలు అయిందని అన్నారు.

బీజేపీ దళారులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేశారని అన్నారామె. బీజేపీ దళారులను కోట్ల రూపాయల నగదుతో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు దళారులకు బీజేపీ కీలక నేతలతో సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.దళారుల ఆడియోలు కూడా బహిర్గతం అయ్యాయి.నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.100కోట్ల నగదును తీసుకెళ్లారు. పైలెట్ రోహిత్ రెడ్డితో మాట్లాడిన ఆడియోలో అనేక అంశాలు ఉన్నాయి.పార్టీలో చేరితే డబ్బులు, పదవులు, సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పారు. సీబీఐ, ఈడీ కేసుల నుంచి రక్షణ కల్పిస్తామని చెప్పారు.సువేందు అదికారి బీజేపీలో చేరితే ఈడీ, సీబీఐ కేసులు తప్పించాము… అలానే డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియాకు ఆఫర్ చేశారన్నారు. పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యేలను తీసుకువస్తే వీలైనంత త్వరగా బీఎల్ సంతోష్ తో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. నంబర్ 2 తో కూడా మాట్లాడిస్తామని హామీ ఇచ్చారు.

ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజల ముందు ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి. 43 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25కోట్ల చొప్పున ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఈడీ, సీబీఐ సోదాలు జరపాలి. బీజేపీ, కేంద్ర హోంశాఖమంత్రి పైన కేసు పెట్టాలి? హోంశాఖ మంత్రి పదవి నుంచి అమిత్ షా ను తప్పించాలి. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణలో ఆపరేషన్ లోటస్ విఫలమైంది. తెలంగాణలో దొరికిన రూ.100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కి వర్షం వస్తుందా.?

బీజేపీకి ఓటు మునుగోడుకు చేటు

గరికిపాటిపై చిరంజీవి సెటైర్

 

- Advertisement -