క్రిటిక్స్‌పై రహానే ఫైర్

9
- Advertisement -

తనపై వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించాడు కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే. తన స్ట్రైక్‌రేట్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్నవారు తనపై ఉద్దేశపూర్వకంగా అజెండా నడుపుతున్నారని ఆరోపించాడు.

నాపై మాట్లాడేవాళ్లు మ్యాచ్‌లు చూడటం లేదు లేదా నాపై అజెండా నడుపుతున్నారు అని అన్నాడు. నేను సాధించిన విజయాలను చూసి వాళ్లు అసూయపడుతున్నారుఅని కూడా వ్యాఖ్యానించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. కేకేఆర్ జట్టు 65 పరుగుల తేడాతో ఓడిపోయింది.నా ఉద్దేశం స్పష్టంగా ఉంది…కొన్నిసార్లు రిథమ్ రాదు, ఫ్లో ఉండదు,ఒక ఇన్నింగ్స్ ఆధారంగా విమర్శించడం సరైంది కాదు అని తెలిపాడు రహానే.

నాపై నెగటివ్ అయినా, పాజిటివ్ అయినా మాట్లాడుతున్నారు అంటే నాకు ఆనందమే అని రహానే అన్నాడు. కేకేఆర్‌ తమ నెక్ట్స్ మ్యాచ్‌ పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 6న ఆడనుంది.

Also Read:వీళ్ల పాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!

- Advertisement -